మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యం: ఎంపి

సిద్దిపేట,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యమవుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ భూమిరెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నర్సారెడ్డిలు పాల్గొన్నారు.