మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన దొంగ అరెస్ట్‌

సిద్దిపేట,మే24(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల రాజక్కపేట గ్రామంలో ఈనెల 18 వ తేదీన ఓ మహిళ మెడలోంచి గొలుసు  దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించినట్టు ఏసీపీ రామేశ్వర్‌ తెలిపారు   ఎసిపి రామేశ్వర్‌ మాట్లాడుతూ  రాజక్క పెట్ట గ్రామానికి చెందిన  కోమటిరెడ్డి లింగవ్వ ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా  వృద్ధురాలిపై దాడిచేసి ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి పోలీసులుఅదే గ్రామానికి చెందిన కోమటిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డిని  అదుపులో తీసుకున్నారు.   గొలుసును సిద్దిపేటలొ అమ్ముతుండగా అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని  విచారించగా దొంగతనం తానే చేశానని అంగీకరించాడు చాకచక్యంగావ్యవహరించిన కానిస్టేబుళ్లకు ఏసిపి రామేశ్వర్‌ వారిని అభినందించారు
—-