మాకు పెన్షన్ వద్దు
– పేదలకు ఇవ్వండి
– బిగ్ బీ అమితాబచ్చన్
లక్నో,అక్టోబర్21(జనంసాక్షి): బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యశ్‌భారతి అవార్డు పొందిన వారికి 50 వేల రూపాయల పెన్షన్ నెలనెలా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమితాబ్, ఆయన భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కలిపి లక్షన్నర నెలనెలా పెన్షన్ ఇవ్వాలని అఖిలేష్ సర్కారు నిర్ణయించింది. అయితే అమితాబ్ కుటుంబం ఆ పెన్షన్ తీసుకునేందుకు నిరాకరించింది. అదే డబ్బును అర్హులైన పేదలకోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించాలని అమితాబ్ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. బిగ్‌బీనా మజాకా! సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే బిగ్ బీ అమితాబ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన కుటుంబానికి లభించే పెన్షన్‌ను వదులుకున్నాడు. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఖర్చు
చేసే కార్యక్ర మానికి బదిలీ చేయాల్సిందిగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివరాల్లోకి వెళ్తే..ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ప్రకారం.. ప్రతిష్ఠాత్మకమైన యశ్ భారతి సమ్మాన్ అవార్డు పొందిన వారికి నెలకు 50 వేల రూపాయల పెన్షన్‌ను జీవిత కాలం అందించనుంది. ఈ పథకం కింద అమితాబ్ బచ్చన్, ఆయన
సతీమణి జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక్కొక్కరు నెలకి 50,000 రూపాయల పెన్షన్‌ను పొందడానికి అర్హులయ్యారు. అయితే ఈ డబ్బును పేదలకోసం ఖర్చు
చేయాల్సిందిగా తను, తన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాయనున్నట్లు
అమితాబ్ వెల్లడించారు.