మాజట్టులో స్టార్లు లేరనే మేమొచ్చాం : కృష్ణమాచారి శ్రీకాంత్‌

ఐపీఎల్‌ ఆరో సీజన్లో సన్‌రైజర్స్‌ సర్‌ఫ్రైజర్‌గా అవతరిస్తుందని ఆ జట్టు మార్గనిర్దేశకుడు కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ మాపని జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించడం మాత్రమేనని ,వారిలో స్పూర్తినింపడం ,వ్యూహాలు రచించడం ,సలహాలు ఇవ్వడం , మ్యాచ్‌లో ఏలా ఆడాలి , అనేవి సూచిస్తామని చెప్పారు. తమ జట్టు సెమిస్‌ చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.తమ జట్టులో హిట్టర్లకు కొదవ లేదని , స్థానిక ఆటగాళ్లంత హిట్టర్లేనని అన్నారు.జట్టులోని ప్రతి ఆటగాన్ని ప్రోత్సహిస్తామని వారికి మద్దతుగా ఉంటామని ఆయన తెలిపారు.