మాజీ ఆర్మీ చీఫ్ సుందరరాజన్ కన్నుమూత
చెన్నై,ఆగస్ట్19 (జనం సాక్షి): ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్ పద్మనాభన్ ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్ వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. పద్మనాభన్ 2000 సంవత్సరం నుంచి 2002 వరకు రెండేళ్లపాటు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2002 డిసెంబర్ 31న సుందర రాజన్ ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాకముందు ఆయన సౌతర్న్ కమాండ్‌లో జనరల్ కమాండిరగ్
ఆఫీసర్‌గా పనిచేశారు. మొత్తానికి 1960 నుంచి 2002 వరకు ఆయన 43 ఏళ్లపాటు ఆర్మీకి సేవలు అందించారు. పద్మనాభన్ ఇండియన్ ఆర్మీ 19వ చీఫ్‌గా పనిచేశారు. ఆయన 1940 డిసెంబర్ 5న కేరళ రాజధాని తిరువనంతపురంలో జన్మించారు.