మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు భారతరత్న అవార్డు ఇవ్వాలి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం , తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు భారతరత్న అవార్డు ఇవ్వాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కొణిజేటి రోశయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రాజకీయాల్లో మచ్చలేని నాయకులుగా రోశయ్య పరిపాలన సాగించారని గుర్తు చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే , ఆర్థిక మంత్రి , ముఖ్యమంత్రి , గవర్నర్ గా ఆయన పనిచేయటం ఆర్యవైశ్య జాతికే గర్వకారణమన్నారు.కేంద్ర ప్రభుత్వం కొణిజేటి రోశయ్యకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు.ఈ విషయమై ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొణిజేటి రోశయ్యకు భారతరత్న అవార్డు ప్రధానం చేసేలా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ , మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు గుండా శ్రీదేవి, గోపారపు రాజు,  దేవరశెట్టి సత్యనారాయణ, కలకోట లక్ష్మయ్య, బిక్కుమళ్ళ కృష్ణ , తాళ్లపల్లి రామయ్య , గుండా మురళి, బెలిదే అశోక్, చల్లా లక్ష్మయ్య, కలకోట అనిత,చల్లా అనిత, మహంకాళి సోమయ్య , మిట్టపల్లి రమేష్, బ్రహ్మదేవర శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీదేవి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.