‘మాతోశ్రీ’ కి మహరాష్ట్ర సీఎం

 

ముంబయి (జనంసాక్షి): మహరాష్ట్ర సీఎం పృధ్వీరాజ్‌ చౌహన్‌ గురువారం బాల్‌ థాకరే నివాసమైన ‘మాతోశ్రీ’ని సందర్శించారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ఆయన భార్య కూడా ఇక్కడకు వచ్చారు. మహరాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కూడా ఇక్కడకు చేరుకున్నారు.శివపేనా పార్టీ జారీచేసిన బులెటిన్‌లో కూడా ఆరోగ్యం మెరుగుగానే ఉందని తెలిపారు. పార్టీనేత సుభాష్‌ దేశాయ్‌ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌, బిజెపి చీఫ్‌ నీతిన్‌ గడ్కరీ, సీనియర్‌ పార్టీనేత గోపీనాథ్‌ముండే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌, నటులు సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌దత్‌,నిర్మాతలు మధుర్‌ భండార్రక్‌, అశోక్‌ పండిత్‌,పారిశ్రామిక వేత్తలు రాహుల్‌ బజాజ్‌, వేణుగోపాల్‌ ధూత్‌ కూడా ఇక్కడకు వచ్చారు.