మాదాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): మాదాపూర్‌ గేమ్‌ పాయింట్స్‌ క్రీడా మైదానంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని మైదానంలో ప్రాక్టీస్‌ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న రేకుల షెడ్డుపై ఉన్న ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలోని కాసామియా ఫుడ్‌కోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్లే మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న కట్టడాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే అక్కడ పనిచేస్తున్న వారు సురక్షితంగా బయటపడగలిగారు.