మాధారంలో ఘనంగా వేడుకలు
సంగారెడ్డి,ఆగస్ట్15(జనం సాక్షి): జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మాధారం గ్రామలో 72వ స్వాతంత్య దినోత్సవం వేడుకుల గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ ప్రతీభ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. పాఠశాలలో హెడ్ మాస్టర్ విజయ్ గౌడ్ జండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు డాన్సులతో అలరించారు. మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



