మానవతా శిఖరం గాంధీజీ…

వరంగల్ ఈస్ట్,  సెప్టెంబర్ 20(జనం సాక్షి)
మానవాళి శ్రేయమే తన ఆశయముతో గొప్ప మానవతా శిఖరం గాంధీజీ అని, గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను అంగీకరించి ఆచరిస్తే, సరిహద్దు గొడవలు- జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగై ప్రపంచమే ఒక శాంతివనం- జగమంత శాంతి మయం అవుతుందని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి -ఆచార్య దామోదర్ పిలుపునిచ్చారు. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజులపాటు (సెప్టెంబర్- 2 నుంచి అక్టోబర్ -2 వరకు) జిల్లావ్యాప్తంగా  గాంధీజీ సిద్ధాంతాల పట్ల యువత, విద్యార్థులకు అవగాహన కల్పించి, గాంధీ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు గాంధీ జయంతి రోజు జిల్లా కలెక్టర్    చేతుల మీదుగా సర్టిఫికెట్ లు బహుమతులు అందజే అందజేయనున్నామని  తెలిపారు. మంగళ వారం నాడు, కరీమాబాదులోని సుభాష్ సెంటర్ వద్ద ప్రైవేటు వేడుకల మందిరంలో ఫౌండేషన్ వరంగల్ జిల్లా కన్వీనర్ డాక్టర్- ఆడెపు రాజేంద్రప్రసాద్, హనుమకొండ జిల్లా కన్వీనర్ మోహన్ వారణాసి ల ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆచార్య దామోదర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇప్పుడున్న యాంత్రిక ప్రపంచానికి గాంధీజీ సిద్ధాంతాలు తప్పనిసరిగా అవసరమని అన్నారు . అనంతరం కార్యక్రమ కరపత్రాలు, బ్రోచర్లను అతిధులు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జాతీయ కన్వీనర్ దాసు సురేష్, ఫౌండేషన్ ప్రతినిధి మోహన్, తెలంగాణ నేత్ర అవయవ శరీరధాతల సంఘం బాధ్యులు కొండ్రెడ్డి మల్లారెడ్డి లతో పాటు వివిధ స్వచ్చ0ద సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు  పాల్గొన్నారు.