మానవత్వాన్ని చాటుకున్న దౌల్తాబాద్ పరిశుద్ధ కార్మికులు.
దౌల్తాబాద్ అక్టోబర్ 16, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ మెన్ నర్సయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని దౌల్తాబాద్ మండల పారిశుద్ధ కార్మికులందరూ కలిసి బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి మానవత్వన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో నాగరాజు, రాములు, బాలరాజు, వెంకటేశం,కృష్ణ,పఠాన్ రాములు, అంజయ్య,మల్లేశం, బాలమల్లు,మహేష్,స్వామి,మల్లేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.