మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం

సర్పంచ్ అయ్య స్వామి                  అలంపూర్ ఆగస్టు 20 (జనం సాక్షి)      పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడకు చెట్లు జీవనాధారం అని సర్పంచ్ అయ్య స్వామి అన్నారు. మండల పరిధిలోని ఊట్కూర్ గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలకు శనివారం సర్పంచ్ అయ్యా స్వామి స్వయంగా ట్రాక్టర్ నడిపి మొక్కలకు నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లో మొక్కలు నాటడం కూడా ఒక భాగమని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత గ్రామస్తులు అందరూ పైన ఉందని ఆయన అన్నారు. ప్రతి పనిని బాధ్యతగా తీసుకుని చేయడం సర్పంచుల పై ఉందని ఆయన అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే చెట్లను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని విరివిగా నాటాలి అన్నారు.