మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారం.

జడ్పీటీసి మేకల గౌరమ్మ చంద్రయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు21(జనంసాక్షి):
మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారమని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య అన్నారు.ఆదివారం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండలం పరిధిలోని మారెడు మాన్ దిన్నె గ్రామంలో గ్రామ సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి,
ఉప సర్పంచ్ వి.శ్రీధర్ రావు లతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్ర భారతంలో మహిళలు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజాసేవలో అగ్రభాగంలో నిలిచారని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మహిళలకు 50 శాతం పదవులు లభించాయని అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రతిరోజు పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, రేపటి భావి పౌరుల భవిష్యత్తుకు దృఢమైన రూపకల్పనకు , దేశం కోసం ప్రాణాలకు ఇచ్చిన జాతీయ నాయకుల చరిత్రను తెలియజేయడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వి.అరవింద్, మాజీ ఎంపీటీసీ టి.వెంకటస్వామి గౌడ్,సింగిల్ విండో డైరెక్టర్ బాలు నాయక్, టిఆర్ఎస్ నాయకులు చంద్రయ్య యాదవ్,వార్డు సభ్యులు బోదాస్ ఎల్లమ్మ నిరంజన్, బేబీ సీతారాం,జి లక్ష్మి శ్రీశేలం, డి.శివ,మహేష్ నాయక్ మరియు పంచాయతీ సెక్రటరీ సల్లేశ్వరం,
ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.