మామతో సంబంధం…భర్తకు చిత్రహింసలు
మెదక్, సెప్టెంబర్ 9 : మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను చిత్రహింసలకు గురిచేసింది. జిల్లాలోని మనూరు మండలం గోరంచకు చెందిన బసమ్మకు రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుమార్తె లాంటి బసమ్మతో మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన రాజు తండ్రిని నిలదీశాడు.
అయినా వారి ప్రవర్తనలో మార్పులేకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. అంతేకాకుండా బసప్ప తన భార్యను వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ప్రశ్నించిన రాజును సోదరుడు అనిల్ సాయంతో గదిలో నిర్భందించి బసమ్మ తాళ్లతో కట్టి చిత్రహింలు పెట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రాజును విడిపించారు. భార్య కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.