మారని కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం

ఢిల్లీ నుంచి ఆదేశం వస్తేనే ముందుకు

అన్నింటికీ ఢిల్లీ శంకులో పడాల్సిందే

సిఎల్పీ నుంచి జిల్లా జాబితాలుకూడా ఢిల్లీ పరిధిలోనే

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిలెప్‌పి లీడర్‌ ఎంపికను కూడా స్థానికంగా చేసుకునే అవకాశంలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. దీనిని కూడా రాహుల్‌ నిర్ణయించే దుస్థితి రావడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో మార్పు లేదన్నదానికి నిదర్శనంగ ఆచెప్పుకోవాలి. గెలిచిని 19మందకిఇ సిలెస్‌పి లీడర్‌ కావాలన్న ఆలోచన కూడా దీనికి కారణంగా చూడాలి. కాంగ్రెస్‌లో సమర్థులకన్నా అసమర్తులే ఎక్కువ.. అందుకే అందరూ తమకు పదవులు రావాలని కోరుకుంటారు. ప్రజాసమస్యలను సమర్థంగా చర్చించి, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టి ప్రజలకు సేవచేయాలన్న తపన కలిగిన వారిని లీడర్‌గా ఎంపికచేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. గురువారం సీఎల్పీ నేత ఎంపికపై భేటీ జరిగినా అధికారం రాహుల్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక ఘట్టం దిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీఎల్పీ నేత ఎన్నిక పరిశీలకుడు కె.సి.వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు చేసి సీఎల్పీ నేతపై అభిప్రాయాలు తీసుకున్నా కూడా ఎవరో ఒకరిని లీడర్‌ చేయలేకపోయారు. రాహుల్‌ చెబితే తప్ప నేతలు వినే స్థితిలో లేరు. ఈ పదవిని అంతా కోరుకోవడం వల్ల వేణుగోపాల్‌ చేతిలో లేకుండ ఆపోయింది. సీఎల్పీ బాధ్యతపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కొందరు ఎమ్మెల్యేలు చెబుతూనే.. అవకాశం ఇస్తే సమర్థంగా ఆ బాధ్యతలను నిర్వహిస్తామని వివరించారు. రాహుల్‌ చెప్పే పేరు ఇక అంతిమం కానుంది. అందుకు నేతలు ఎదురు చూస్తున్నారు. ఇకపోతేజిల్లా కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుల ఎంపిక పక్రియ కొలిక్కి వచ్చింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలకు డీసీసీ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ నమూనా అందజేయగా ఆయా జిల్లాల ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. తుది జాబితాకు సంబంధించి ముఖ్యనేతలు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు బోస్‌రాజు, సలీం అహ్మద్‌, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్‌ తదితరులతో పాటు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.హైదరాబాద్‌ మినహా ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు రూపొందించిన డీసీసీ అధ్యక్షుల జాబితాపై కసరత్తు చేశారు. ఒకట్రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఒకరి పేరునే ప్రతిపాదిస్తూ తుది జాబితా రూపొందించినట్లు తెలిసింది. జిల్లాల పక్రియ కూడా పూర్తి చేసి ఏఐసీసీకి తుది జాబితాను పంపిస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక టీపీసీసీ పంపిన జాబితాకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.