మార్చి 15న నాటికి భారత్ బలగాలను ఉపసంహరించండి
` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు
` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు
` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు ఆదివారం మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై చర్చించారు.మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్‌కు తెలిపారు. దాంతోపాటు భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సవిూక్షించనున్నట్టు ఆ దేశ సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ స్థానిక వార్తా పత్రికకు వెల్లడిరచారు.గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్లను వినియోగించడం ఆపేయాలని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 77 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారత్‌ను కోరారు.అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన ఆయన పలు ఒప్పందాలు చేసుకున్నారు. శనివారం స్వదేశానికి వచ్చిన తర్వాత ఏ దేశం పేరు ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని, అందుకు ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదని అన్నారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.
మాల్దీవుల అధ్యక్షుడికి షాక్..
అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది.భారత అనుకూల పార్టీ అయిన ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ శనివారం ఘనవిజయం సాధించింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల విూడియా ‘అఖండ విజయం’గా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిప్‌ా నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు నోరుపారేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పర్యాటక ఆధారిత దేశమైన మాల్దీవులకు ఎవరూ వెళ్లొద్దని సామాజిక మాధ్యమాల్లో భారత్‌లోని వివిధ వర్గాల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పిలుపునకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచీ మద్దతు లభించింది. మాల్దీవులకు (ఓజీశ్రీటతిలవబ) బదులు మన లక్షద్వీప్‌నకు వెళ్లాలని సూచిస్తున్నారు.
మాది చిన్న దేశమే.. బెదిరించడం తగదు
‘’భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం మాత్రం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు’’ అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు.చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘..ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే.
కానీ మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.విూ. ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదు.ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిది. మేం ఎవరి పెరడులోనో లేం. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అని చెప్పారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.