మార్నింగ్ వాక్‌లో కడియం ప్రచారం
వరంగల్, నవంబర్6(జనంసాక్షి):
వరంగల్ పార్లమెంట్ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌పార్టీ సీరియస్‌గా తీసుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకు అందివచ్చిన ప్రతి నిమిషాన్ని కూడా ప్రచారం కోసమే వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మాజీఎంపి, ప్రస్తుత ఉపముఖ్య మంత్రి కడియంకు పెను సవాల్‌గా మారింది. దీంతో ఆయన నిద్రలేచిందే మొదలు అర్దరాత్రి వరకు తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పార్టీ అభ్యర్థి దయాకర్‌లు మార్నింగ్ వాకింగ్‌తో ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌యస్ పార్టి ఉప ఎన్నికలలో తన ప్రచారన్ని మొదలు పెట్టింది. ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోనేందుకు నియోజక వర్గలలో మంత్రులు సైతం ప్రచారం చేస్తున్నారు .ఇక ఈఉన ఎన్నికకు సమన్వయకర్తగా ఉన్న డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అపార్టి ఎంపి అభ్యర్ధి పసూనూరి దయాకర్‌తో కలిసి హన్మకోండలోని అర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మైదానంలో వాకింగ్ చేస్తున్న వారిని కలిసి అక్కడ సమావేశాన్ని ఎర్పాటు చేసారు. అయితే ఈ ప్రచారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇక ఈ అంశంపై కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల అదికారికి ఫిర్యాదు చేయనున్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం విద్యాసంస్థలలో ప్రచారం చేయవద్ద అని ఒకవేళ చేస్తే అది కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందన్న విషయాన్ని కడియం లైట్‌గా తీసుకున్నాడు.