మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు
ధర్మపురి నవంబర్3 (జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుంపుల రమేష్, కాళ్ళ జగన్, కాళ్ళ సత్తయ్య, ముత్తుట్ల సత్తయ్య, గాదం సత్తయ్య, బావల రాజన్న, ముత్తూర్ల శ్రీనివాస్, వీరి సమక్షంలో
రామయ్య పల్లె గ్రామంలో గురువారం ఉదయం రామయపల్లి మాలల ఐక్యవేదిక గ్రామ అధ్యక్షుడిగా లింగయ్య, ఉపాధ్యక్షుడు తూడిచెర్ల మల్లేశం ప్రధాన కార్యదర్శి గాదం సురేష్, సంయుక్త కార్యదర్శి కాళ్ల రవీందర్, కోశాధికారి బోధనపు శ్రావణ్ ను ఎన్నుకున్నారు తదనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ,
మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, సాధికారత కోసం పని చేస్తుందని, ధర్మపురి మండల ధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ సూచిస్తూ, రామయ్య పల్లె మాల కులస్తులకు, కమ్యూనిటీ భవనం మరియు విద్యావంతులకు అర్హులకు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ను అందిపుచ్చుకోవాలని సభను ఉద్దేశించి ఆయన అన్నారు.
ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు కుస శేఖర్,కాళ్ల మల్లేష్,కాళ్ళ లింగయ్య,కాళ్ళ శంకరయ్య,తుడిచెర్ల మల్లయ్య, కూస వేణు తదితరులు కమిటీలో పాల్గొన్నారు.