మాలీలో ముగిసిన ఆపరేషన్
రాడిసన్ బ్లూ హోటల్‌పై ఉగ్రదాడి శ్రీ27 మృతదేహాల లభ్యం
న్యూఢిల్లీ,నవంబర్20(జనంసాక్షి):
పారిస్ నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడి చిందిం చిన రక్తం తడి ఆరకముందే మరో ఉగ్రదాడికి మాలి వేదికయ్యింది. హోటల్ల్లో ఉగ్రవా దులు తెగించ డంతో 27 మంది హతమాయ్యరు. కడపటి వార్త లందే సమయానికి ఆపరేషన్ ముగిసిన ట్లుగా అధికా రిక ప్రకటన వెలువడింది.పశ్చిమ ఆఫ్రి కాలోని మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చి పోయారు. రాజధాని బమా కోలోని రాడిసన్ బ్లూ ¬టల ్‌లోకి చొరబడి అక్కడివారిని బందీలుగా చేసుకున్నారు. ¬టల్ సిబ్బంది, బస చేసిన వారిని మొత్తంగా 170 మం దిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో 27మందిని ఉగ్ర వాదులు కాల్చిచంపారు. కాగా ఇద్దరు మిలిటెం ట్ల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది భారతీ యులు సురక్షీతంగా విడుదల అయ్యా రు. మృతుల్లో ఐరాస సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకు న్న భద్రతా బలగాలు ¬టల్ ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి.ఉగ్రవాదుల చెరలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు
తెలుస్తోంది. అందునా అమెరికన్లు ఎ క్కువగా ఉన్నట్లు స్థానిక విూడియా తెలిపింది. బందీల్లో చైనీయులు కూడా ఉన్నట్లు చైనా విూడియా వెల్లడించింది. వీ చాట్ మొబైల్ యాప్ ద్వారా చెన్ అనే వ్యక్తి ¬టల్‌లో చిక్కుకుపోయిన చైనీయుల్లో తాను కూడా ఉన్నట్లు చైనా విూడియాకు సమాచారం అందించారు. ఇక్కడ విదేశీయులు ఉన్నారన్న సమాచారంతోనే ఉగ్రవాదులు దాడికి తెగించారని భావిస్తున్నారు. రాడిసన్ బ్లూ ¬టల్‌లో బందీలుగా చేసుకున్న వారిలో కొందరిని ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు సమాచారం. ఖురాన్ వ్యాఖ్యలు చెప్పినవారిని కొందరిని వదిలేసినట్లు విూడియాలో కథనాలు వస్తున్నాయి. ఉగ్రవాదులు ¬టల్‌లో కాల్పులు జరిపేముందు ‘అల్లాహ్ అక్బర్’ అని అన్నట్లు సమాచారం.¬టల్లో మొత్తం 170 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 140 మంది టూరిస్టులు, 30 మంది ¬టల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.ఉగ్రవాదులు.. 190 గదులతో ఉన్న ¬టల్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లా¬ అక్బర్, దేవుడు గొప్పవాడు, ఇతర కొన్ని అరబిక్ పదాలతో గట్టిగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదులు ¬టల్‌లోకి చొరబడ్డారు. అయితే వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరంతా కూడా దుబాయ్ కి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తూ ఆ ¬టల్ లో ఉంటున్నారని తెలిసింది. మరోపక్క, బందీలుగా ఉన్న 20మంది భారతీయులు క్షేమమేనంటూ భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ ¬టల్ లో బందీలుగా ఉన్న టూరిస్టులలో ఎక్కువగా అమెరికా, బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. మరోపక్క, ఓ 20 మంది బందీలను ఇప్పటికే ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు మాలీ ఆర్మీ కమాండర్ తెలిపాడు. అయితే, 20మందినే ఎందుకు విడిచిపెట్టారో అసలు లోపల ఇంకెంతమంది బందీలుగా ఉన్నారో తమకు అర్థం కావడం లేదని కూడా ఆయన అన్నారు.
హోటల్‌లో మొత్తం పది మంది ఉగ్రవాదులు
రాడిసన్ బ్లూ ¬టల్‌లో ఆయుధాలు కలిగిన ఇద్దరు ముష్కరులు ప్రవేశించినట్లు భద్రతాధికారులు తొలుత గుర్తించారు. అయితే మొత్తం 10 మంది ఆయుధాలు కలిగి ఉన్నట్లు ఆ తర్వాత ధ్రువీకరించారు. తప్పుడు నంబర్లు కలిగిన వాహనాన్ని ఉపయోగించి ఉగ్రవాదులు ¬టల్ వద్దకు చేరుకున్నట్లు గుర్తించారు.
మాలిలో ఇలాంటి సంఘటనే ఈ ఏడాది ఆగస్టు నెలలోనూ చోటుచేసుకుంది. మాలిలోని సెవేర్
హోటల్‌లోకి ఉగ్రవాదులు చొరబడి దాదాపు 13 మందిని దారుణంగా హత్య చేశారు.
తప్పించుకున్న గాయకుడు
మాలిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉగ్రవాదుల చెర నుంచి గినియా దేశానికి చెందిన ప్రఖ్యాత గాయకుడు సెకౌబా బాంబినో సురక్షితంగా బయటపడ్డారు. చిక్కుకున్న వారిలో కొందరిని భద్రత బలగాలు కాపాడాయి. సెకౌబా బాంబినో బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఉదయం బుల్లెట్ల శబ్దంతోనే నిద్ర లేచాను. ¬టల్‌కు ఎవరో చిన్న నేరస్థులు వచ్చారేమో అనుకున్నా.. ఇరవై, ముఫ్పై నిమిషాల తర్వాత అర్థమైంది వారు చిన్న నేరస్థులు కాదని’ అని సెకౌబా తెలిపారు.