మాలెగావ్ నిందితులకు బెయిల్ ఇవ్వలేం : సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాలెగావ్ పేలుళ్లకు సంబంధించిన నిందితులు మాజీ సైనికాధికారి శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్, ప్రజ్ఞా ఠాకూర్‌లకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులు నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్నారని, వారి దరఖాస్తులను న్యాయస్థానం విన్పించుకోవడంలేదని నిందితుల తరపు సీనియర్ న్యాయవాది యూఆర్ లలిత్ పేర్కొన్నారు. అయితే ఈ దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తులు హెచ్‌ఎల్ దత్తు, సీకే ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.