మాల్యా విమానం ఆధ్యాత్మిక పర్యటనలకు వినియోగిస్తాం

kingfisherవిజయ్ మాల్యా. లిక్కర్ డాన్ గా… కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా సుపరిచితం. అంతకు మించి బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన వ్యక్తిగా…. వెల్ నోటెడ్ పర్సన్. నయానో… భయానో ఆయన నుంచి రాబట్టుకునే ఆస్తుల కోసం బ్యాంకులు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన పేరుతో ఉన్న ఆస్తులను వేలం వేస్తోంది.

ఇందులో భాగంగానే మాల్యా పర్సనల్ ప్లైట్ ను గతంలోనే వేలం వేసింది. దీనిని SGI కామెక్స్ అనే సంస్థ వేలంలో కొన్నట్టు ప్రకటించింది. 27 కోట్ల 39 లక్షలకు దక్కించుకున్న SGI సంస్థ…. దీనిని ఎయిర్ లైన్స్ గానో… ప్రైవేట్ వ్యక్తుల టూరిజానికి వాడమని చెబుతోంది. ఎయిర్ బస్ ఏ319 -133 ప్లైట్ ను తీర్థయాత్రల కోసం వినియోగిస్తామని ప్రకటించింది. దేశ, విదేశాల్లోని ఫేమస్ టెంపుల్స్…. ఆధ్యాత్మిక ప్రదేశాల్లోని అద్భుత కళాకండాలను చూపించేందుకు వాడతామని చెబుతోంది SGI సంస్థ. అటు ఫారిన్ టూరిస్టుల ఆధ్యాత్మిక పర్యటనలకు వినియోగిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.. మాల్యా తన వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని కోట్ల రూపాయలతో తీర్చిదిద్దాడు. ఇక దీన్ని వేలంలో SGI సంస్థ అతి తక్కువ ధరకే దక్కించుకోవడం విశేషం. వాస్తవానికి వేలంలో నిర్ణయించిన కనీస ధరలో…. SGI సంస్థ ఆరోవంతుకు ప్లైట్ ను సొంతం చేసుకుంది. 800 కోట్లు రాబట్టుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఈ ప్లైట్ ను వేలానికి పెట్టింది.  152 కోట్లు మినిమమ్ కాస్ట్ నిర్ణయించగా… ఫస్ట్ టైమ్ దుబాయ్ చెందిన ఓ సంస్థ కోటి రూపాయలకు బిడ్ వేసింది. ఐతే ఆ వేలాన్ని ఆపేసి…. ఈ నెల 18 న మళ్లీ వేలం నిర్వహించారు. 27 కోట్ల 39 లక్షలతో….దీనిని దక్కించుకున్న SGI సంస్థ మరో 23 కోట్లతో ప్లైట్ కు తుది మెరుగులు దిద్దాలని డిసైడైంది. ఒకప్పుడు మాల్యా విలాసాలకు సాక్ష్యమైన ఈ ఫ్లైట్…. ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్లనుంది.