మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుసవాల్‌

4

– ఫెడరల్‌ స్పూర్తిని కొనసాగిస్తాం

– దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌

విజయవాడ,డిసెంబర్‌12(జనంసాక్షి):  దేశంలో మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనసవాల్‌గా మారారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.శనివారం విజయవాడలో గేట్‌ వే ¬టల్లో ప్రారంభమైన దక్షిణాది రాష్టాల్ల్రో ప్రాంతీయ సదస్సుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వామపక్ష తీవ్రవాదంతో అంతర్గత భద్రతకు సవాల్‌ ఎదురవుతోందని చెప్పారు. సరైన సహకారం, సమన్వయంతోనే వీటిని అదుపుచేయగలమని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను అంతర్రాష్ట్ర సమస్యగా గుర్తిస్తూ దక్షిణాది రాష్ట్రాల  ప్రాంతీయ మండలి సమావేశం నిర్ణయించింది.  గత నవంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో తీర్మానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడంపై, పునరావాస ప్యాకేజీపై ఏపీ ఒక నివేదికను సమర్పించింది. ఏపీ మాదిరిగానే ఏం చేశారో తెలపాలని మిగిలిన రాష్ట్రాలను ¬ం శాఖ కోరింది. కాగా వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపాన్ని తెలియజేశారు. వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు.  సమాఖ్య స్ఫూర్తిని సాధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. అభివృద్ధి, ప్రగతిలో భాగస్వాములను చేయడమే దీని ఉద్దేశమని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది సరైన వేదికగా ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిన తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్‌నాథ్‌ చెప్పారు. . తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వివాదంపై ఈ సందర్భంగా చర్చించారు. జాతీయ రహదారి బిల్లుపై తెలంగాణ పలు అభ్యంతరాలను ప్రస్తావించింది. తీరంలో మత్సకారుల చేపల వేట అంశాన్ని కేరళ ప్రస్తావించింది. దీనికి స్పందించిన ¬ంశాఖ మత్సకారులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాలల్లో డ్రగ్‌కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ను పటిష్ఠం చేయడంపై తీర్మానించారు. కాగా, ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డిలు హాజరయ్యారు.