మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి
చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన దళాలు గాలింపు చర్యల్లో ఉండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఎస్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మావోయిస్టులు తప్పించుకుపోయారని అధికారులు తెలిపారు.