మావోయిస్ట్ మృతదేహం లభ్యం
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్ట్‌లకు భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే.. తాజాగా ఈ రోజు ఉదయం ఎలమగొండ అడవి ప్రాంతంలోఓ మావోయిస్ట్ మృతదేహం, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, రెండు మ్యాగ్‌జైన్లు లభించాయి. మావోయిస్ట్ మృతదేహాన్ని గుర్తించడం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.