మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

   నిర్మల్ బ్యూరో, అక్టోబర్20,జనంసాక్షి,,    బోధ వ్యాధి నివారణకు నియంత్రణకు చేపడుతున్న మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఈరోజు సిర్గాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫరూక్ . అడిషనల్ కలెక్టర్ హేమంత్   మరియు రాష్ట్ర జాయింట్  డైరెక్టర్ ప్రజా ఆరోగ్య మరియు  కుటుంబ సంక్షేమ శాఖ వారితో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారందరూ కూడా మాత్రలు వేసుకొని బోదకాల వ్యాధి నుండి రక్షణ పొందాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ తుకారాం  గారు మాట్లాడుతూ బోధ  వ్యాధి ఒకసారి సోకితే దానికి చికిత్స లేదని అందుకని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సిబ్బంది సూచన విధంగా మాత్రమే వేసుకోవాలని కోరారు. సిబ్బంది అందరూ కూడా అంకితభావంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు.
 ప్రజల్లో ఉన్న భయాన్ని అనుమానాల్ని తొలగించడానికి స్వయంగా జిల్లా కలెక్టర్ ముషారఫ్  గారు అడిషనల్ కలెక్టర్ హేమంత్ గారు  గారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్  గారు అక్కడే మాత్రలను వేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO  డాక్టర్ రాజేందర్ గారు, కార్యక్రమం నిర్వాణ అధికారి డాక్టర్ రాజా రమేష్ గారు, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు డిప్యూటీ డెమో రవీందర్ గారు తదితరులు పాల్గొన్నారు
Attachments area