మా అంచనాలు తారుమారయ్యాయి

1

– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనంసాక్షి):

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమిని బోర్టు సమావేశంలో విశ్లేషించామని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ మహాకూటమి బలాబలాలపై తమ లెక్కలు తప్పాయన్నారు. కూటమి బలాన్ని అంచనా వేయడంలో తప్పటడుగు పడిందన్నారు. ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. గెలుపు, ఓటములు సాధారణమని, బిహార్‌ ఫలితాలు నరేంద్రమోదీ పాలనకు రెఫరెండం కాదని ఆయన అన్నారు. మహాకూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని జైట్లీ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం సమావేశం అయింది. ఈ భేటీకి పార్టీ అద్యక్షుడు అమిత షా, ప్రధాని నరేంద్రమోదీ కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, నితినగడ్కరీ,వెంకయ్యనాయుడు, సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారో చర్చించేందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమవేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అమిత్‌షా స్వాగతం పలికారు.