మా రాజధాని శంకుస్థాపనకు మీరంతా రండి
హైదరాబాద్ అక్టోబర్17(జనంసాక్షి):
అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాలను మంత్రులు బృందాలుగా విడిపోయి అందచేస్తున్నారు. ఈనెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన మ¬త్సవానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలు, ప్రముఖులకు ఏపీ మంత్రుల బృందం ఆహ్వానపత్రికలను అందజేస్తోంది. విఐపిలకు మంత్రలకు సాదర ఆహ్వానం పంపుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వీరు ఆహ్వానాలను అందచేస్తున్నారు. ఇక తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఎపి సిఎం చంద్రబాబు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందచేయనున్నారు. శనివారం ఉదయం ఏపీ మంత్రులు హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులకు ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని అమరావతి శంకస్థాపనకు రావాల్సిందిగా మంత్రులు ఆహ్వానించారు. అలాగే మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ పవన్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. . రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వ పెద్దలు సంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తున్నారు. మంత్రి నారాయణ స్వయంగా రాజధాని గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతూ సారె, చీరతో ఆహ్వానం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఏపీ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ పర్యటించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ రైతులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మరోవైపు రాజధాని వేడుకకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
నేడు కెసిఆర్,గవర్నర్‌లకు బాబు స్వయంగా ఆహ్వానాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రబాబు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం. క్యాంపు కార్యాలయమా లేక సచివాలయమా అన్నది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నేరుగా వెళ్లి కెసిఆర్‌ను ఆహ్వానిస్తారు. ఇటీవల మంత్రివర్గంలో నిర్ణయింఇన మేరకు బాబు స్వయంగా ఆహ్వాన పత్‌ఇరిక అందించాలని నిర్ణయించారు. అదేవింధంగా గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి ఆహ్వానపత్రిక ఇచ్చి అమరామతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరనున్నారు.