మిచౌంగ్ తుఫాన్ ఉధృతంగా ఉంది..


ఇల్లందు డిసెంబర్ 5 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు మిచౌంగ్ తుఫాన్ ఉదృతంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట నష్టం జరగకుండా తగిన ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కోరారు.ఈసందర్బంగా కనకయ్య మాట్లాడుతూ..ప్రభుత్వం అధికారులు అందుబాటులో ఉండాలని, నియోజవర్గ స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం, పంట నష్టం ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తుఫానుకు సంబంధించిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తో సహా ఆర్డిఓ, వ్యవసాయ, ఉద్యానవన వాణిజ్య పంటలు, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలు అధైర్య పడవద్దని, అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని కోరారు.అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744 241950 సంప్రదించాలన్నారు