మిజోరం బస్సు ప్రమాదంలో 18 మంది మృతి
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు 100కి.మీ.దూరంలోని కెఫాంగ్ వద్ద బస్సు లోయలో పడటంతో 18 మంది ప్రయాణీకులు ప్రాయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఐజ్వాల్ సివిల్ ఆసుప్రతికి తరలించినట్టు పోలీసులు అన్నారు. ఇరుకుదారి కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిందని ప్రత్యక్షసాక్షులు తెలియజేశారు.