మిని మహానాడుకు తరలిన తెలుగుతమ్ముళ్లు
హైదరాబాద్‌లోని ఎక్జిబిషన్ గ్రౌండ్‌లో గురువారం జరిగే తెలుగుదేశం పార్టీ మిని మహానాడు కార్యక్రమానికి గద్వాల తెలుగుతమ్ముళ్లు తరలి వెళ్లారు. నియోజకవర్గఇంచార్జీ గంజిపేట రాములు ఆద్వర్యంలో ఆయామండలాల అద్యక్ష, కార్యదర్శులు వాహనాలలో తరలి వెళ్లారు. ఈ సారి జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాములు తెలిపారు. మిని మహానాడుకు టిడిపి జాతీయ అద్యక్షులు నారాచంద్రబాబునాయుడు హాజరవుతారని వారు తెలిపారు. హైదరాబాద్ కు తరలిన వారిలో గంజిపేటరాములు, గద్వాల చిత్తారికిరణ్, గట్టు నాగరాజు, మల్దకల్ గోవిందు, ధరూరు పుల్లయ్యగౌడు,టిఎన్‌ఎస్‌వి సుజన్‌కుమార్‌రెడ్డి, రాంబాబునాయుడు, షబ్బీర్, ముఖీద్ ,బీంపురం రఘు,అధికార ప్రతినిధు వాసు , సురేష్ తదితరులు ఉన్నారు. కాగా మినిమహానాడులో రక్తదానం చేసినట్లు వారు తెలిపారు.