మినీ ట్యాంక్ బండ్ కొత్త చెరువు వద్ద అమృతలాల్ శుక్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్.
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 15.(జనం సాక్షి) మినీ ట్యాంక్ బండ్ కొత్త చెరువు వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ శాసనసభ్యులు అమృతరం శుక్ల విగ్రహం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ కోరారు. బుధవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పార్టీ కార్యాలయం నుండి మానేరు తీరంలోని కామ్రేడ్ అమృతరాల శుక్ల స్మారక స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీనియర్ న్యాయవాది అమృతలాల్ శుక్ల కుమారుడు శాంతి ప్రకాష్ శుక్ల ప్రారంభించారు. స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం మషం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేసిన అమృత శుక్ల విగ్రహాన్ని మినీ ట్యాంక్ బండ్ కొత్తచెరువు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని బలమైన కార్మిక పోరాటాలు నిర్మిస్తామని అన్నారు.. కార్యక్రమంలో గన్నేరువరం నరసయ్య, కోడం రమణ, ఎటువంటి ఎల్లారెడ్డి, అన్నదాస్ గణేష్,మొర అజయ్, తదితరులు పాల్గొన్నారు