మినీ రవీంవ్రభారతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

కేవీ, రమణాచారి

కరీంనగర్‌కల్చరల్‌, న్యూస్‌లైన్‌: ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్నమినీ రవీంద్రభారతిని త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కతిక శాఖ ముఖ్యసలహాదారులు కేవీ. రమణాచారి అన్నారు. నగరంలోని బొమ్మకల్‌రోడ్‌గల శ్రీ యజ్ఞ వరహాస్వామి ఆలయంలో దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా శనివారం కరీంనగర్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు . అసంపూర్తిగా నిలిపోయిన మినీ రవీంద్రభారతి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి  ప్రతిపాదనలు తయారుచేసినట్లు చెప్పారు. 300 నుంచి 500మంది వరకు కూర్చునే విధంగా ఆడిటోరియ నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాచీన కళల పరిరక్షణ కోసం జిల్లాకు కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. నల్డొండ, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలో చిందు, యక్షగానం కళాకారుల జీవన విధానంలో మార్పు తేవడానికి, వారికి కావాల్సిన కిరీటాలు, అభరణాలు కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. చిందు, యక్షగాన కళాకారుల గణన, వారి కుటుంబాల పరిస్థితి తదితర విషయాల సేకరణ కోసం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో గణన  కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.