మిర్యాలగూడలో 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన… భారీ ర్యాలీ :

 

మిర్యాలగూడ జనం సాక్షి :
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవవేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన శనివారం నిర్వహించారు. 750 మీటర్ల జాతీయ పతాక, భారీ ర్యాలీను మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ భార్గవ్ ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు,వ్యాపార, వాణిజ్య, కిరాణా, విద్యా సంస్థల, ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం, శకుంతల టాకీస్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రాజీవ్ చౌక్ ద్వారా తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు. నినాదాలు, దేశభక్తి పాటలతో హోరెత్తించారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, సీఐలు శ్రీనివాస్ సురేష్ తో పాటు ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఏఈ ఆదినారాయణ, జర్నలిస్ట్లు ఎండి.అస్లాం. రంగా శ్రీనివాస్.ఎస్ఐలు కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, ఉదయ భాస్కర్, సలీం, ఇలియాస్, నాగలక్ష్మి, స్రవంతి, పాటు పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికార సిబ్బంది మెప్మా సిబ్బంది, అభ్యాస్ విద్యాసంస్థలు, మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఇస్లాం పుర ఉర్దూ పాఠశాల తదితర పాఠశాలల విద్యార్థులు, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ముసలోళ్ళు ముదిరెడ్డి నర్సిరెడ్డి జానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కడారి వెంకట్, తదితరులతోపాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ జిల్లా నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎండి మహిముద్ అలీ, కిరాణా మర్చంట్ అసోసియేషన్ నాయకులు మాజీద్అలీ, రవి, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, జానీ,మగ్దూం పాష, గుడిపాటి సైదులుబాబు, నవాబ్,షోయబ్,గాయాస్, వివిధ సంఘాల నాయకులు మారం శ్రీనివాస్, మాలోతు దశరథ్ నాయక్, బంటు వెంకటేశ్వర్లు, మురళి యాదవ్, ఎర్రయ్య యాదవ్, జయరాజు, ముస్లిం మత పెద్దలు మౌలానా మగ్దూం మొయినుద్దీన్, ముఫ్తిలు ఇమ్రాన్, ఉమర్ అఖిల్,ఇద్రిస్,లు తోపాటు ఉపాధ్యాయ సంఘ నాయకులు మామిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ కస్తూరి, ప్రజలు, సంఘాల ప్రతినిధులు పాఠశాల, కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.