మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం:- జిల్లా సాధన సమితి
మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు ఉండి జిల్లా ఏర్పాటుకు నోచుకోని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సాధించుకుంటామని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులు బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాడి రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగం గౌడ్ బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్, షెడ్యూల్డు కులములు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం శ్రీనివాస్ లు అన్నారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయంలో మిర్యాలగూడ జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, బియ్యం,సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని రాష్ట్ర జాతీయ స్థాయి రోడ్డు,రైలు మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిర్యాలగూడ నుండి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని జిల్లా ఏర్పాటు విషయమై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ప్రశ్నించారు. ప్రపంచంలోనే పేరుగాంచిన సాగునీటి ప్రాజెక్టు నాగార్జునసాగర్ మిర్యాలగూడ సమీపంలోని ఉన్నదని, పొరుగు రాష్ట్రాలకు సమీపంలోనే మిర్యాలగూడ ఉన్నదని తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన జనాభా కలిగి ఉండటంతోపాటు రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపాలిటీ మిర్యాలగూడ పేరుగాంచిన లేదని అన్నారు.పాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి మిర్యాలగూడ ప్రజల చిరకాల వాంఛ అయిన జిల్లా ఏర్పాటును హుజూర్ నగర్ మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండ నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని రానున్న రోజుల్లో ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నూతన జిల్లాగా మిర్యాలగూడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కోలా సైదులు, కోల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్ల వెంకటయ్య, మైనార్టీ సంఘం జిల్లా నాయకులు మోసిన్ అలీ, మైనార్టీ సంఘం మండల అధ్యక్షులు మహిముద్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి, రిటైర్డ్ వేమ ఉపాధ్యాయులు రామచంద్రయ్య రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకన్న అశోక్ కట్ట సైదులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.