మిర్యాలగూడ జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యం:- తిరుమలగిరి అశోక్ ‎

మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణలో అన్యాయానికి గురైన మిర్యాలగూడ జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యంగా విద్యార్థి యువజన సంఘాలు ముందుకు వెళ్తాయని బీసీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు.గురువారం మిర్యాలగూడలోని ఎన్నెస్పీ అతిథిగృహంలో జరిగిన మిర్యాలగూడ జిల్లా సాధన సమితి విద్యార్థి,యువజన విభాగాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ఏర్పాటులో వివక్ష ప్రదర్శించడంతో మిర్యాలగూడకు జిల్లాగా ఏర్పడే అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థి యువజన ఉద్యమాలతోనే ఏదైనా సాధ్యమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో  విద్యార్థి యువజన సంఘాలను చైతన్యపరిచి జిల్లా సాధన ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. శాంతియుత మార్గంలో ధర్నాలు బందులు రాస్తారోకోలు నిర్వహించి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజల ఉద్యమంతోనే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధ్యమని అన్నారు. టిఆర్ఎస్వి నాయకులు తిరుమలగిరి అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువజన విభాగం నాయకులు, సర్పంచ్ శ్రవణ్ కుమార్ బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, టి టి ఎఫ్ కన్వీనర్ కస్తూరి ప్రభాకర్, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు, సిపిఐ ఎంఎల్ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జ్ నాగేశ్వరరావు, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు యాదవ్ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, దాసరాజు జయరాజు సిపిఐ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ధీరావత్ లింగ నాయక్ విద్యార్థి విభాగం నాయకులు శేఖర్ శ్రవణ్ కుమార్, సంపత్ కుమార్ రాము సామేలు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకయ్య యాదవ్ డివిజన్ అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య ఎంఐఎం నాయకులు ఫారుక్, సామిల్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
 

తాజావార్తలు