మిర్యాలగూడ జిల్లా కోసం వేలాది నామినేషన్ల తో మునుగోడులో పోటీ చేస్తాం:-
మిర్యాలగూడ. జనం సాక్షి
జిల్లా సాధన సమితి
మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష జిల్లా ఏర్పాటు అని, కొత్త జిల్లాల ఏర్పాటులో మిర్యాలగూడకు తీవ్ర అన్యాయం చేశారని మునుగోడు ఎన్నికల కంటే ముందు మిర్యాలగూడ జిల్లాను ప్రకటించాలని లేనిపక్షంలో మిర్యాలగూడ జిల్లా ను కోరుకునే వేలాది మందితో నామినేషన్ వేసి పోటీలో ఉంటామని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు జాజుల లింగం గౌడ్ అన్నారు. ఆదివారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ కంటే తక్కువ జనాభా విస్తీర్ణం ఆదాయ వనరులు రోడ్లు రైలు మార్గాలు లేని వాటిని జిల్లాగా ఏర్పాటు చేశారని అన్ని సౌకర్యాలు ఉన్నా మిర్యాలగూడను జిల్లా చేయకుండా కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ఒకే ఒక నియోజకవర్గం కలిగిన జనగామ గద్వాల సిరిసిల్ల నారాయణపేట వంటి వాటిని జిల్లాలను చేసి పురాతన కాలం నుండి రెవెన్యూ డివిజన్ గా ఉన్న మిర్యాలగూడను జిల్లాగా చేయలేదన్నారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు ప్రజాప్రతినిధులు మిర్యాలగూడ జిల్లాగా చేయాలని గత 60 రోజుల నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మిర్యాలగూడ పరిధిలో 15 లక్షల జనాభా 7.50 లక్షల ఓటర్లు ఉన్నారని తెలిపారు.అన్ని అర్హతలు ఉన్నా మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గతంలో నల్గొండ జిల్లాలో SLBC ప్రాజెక్ట్ కోసం 370 నామినేషన్ వేసిన మాదిరిగానే మిర్యాలగూడ జిల్లా కోసం 1000 నామినేషన్లు వేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మిర్యాలగూడ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సాధన సమితి నాయకులు బంటు వెంకటేశ్వర్లు, ఫారుక్ దుర్గయ్య, వెంకటయ్య, బంటు కవిత, సందన బోయిన జయమ్మ, తుకారాం నరేష్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.