మిస్త్రీకి ఎదురుదెబ్బ

cyrus-mistry_ptiసైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ తగిలింది. టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌ మాదిరి ఆయన నాయకత్వానికి మద్దతునిచ్చే విషయంలో టాటా మోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఒక్కతాటి పైకి రాలేదు. పైగా మిస్త్రీ విమర్శించిన నానో కారు సహా కంపెనీ తీసుకున్న అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా సమర్థించారు. సోమవారం రాత్రి టాటా మోటార్స్‌ బోర్డు సమావేశం జరిగింది. టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు మిస్త్రీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో టాటా మోటార్స్‌ బోర్డు సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.దీనికి తోడు కీలక కంపెనీల నుంచి మిస్త్రీని బయటకు పంపించేందుకు టాటా సన్స్‌ దూకుడు ప్రదర్శిస్తుండటం కూడా టాటా- మిస్త్రీల మధ్య వివాదానికి మరింత వేడిని రాజేసింది. ‘ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలతో పాటు వ్యాపారం, యాజమాన్యం, నిర్వహణ అంశాలపై మీడియాలో వచ్చిన కథనాల ప్రభావంపై సమీక్షించేందుకు టాటా మోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు సమావేశమయ్యారు.