మిస్త్రీ ఆరోపణలు అవాస్తం

untitled-1

– తొలిగింపు ఉమ్మడి నిర్ణయం

– టాటా సన్‌

ముంబై,అక్టోబర్‌ 27(జనంసాక్షి): సైరస్‌ మిస్త్రీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించింది టాటా సన్స్‌. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేసింది. నిరాధార ఆరోపణలు చేస్తూ తన గౌరవాన్ని పోగుట్టుకున్నారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల ముందు కంపెనీ ప్రతిష్టను దిగజార్చేలా మిస్త్రీ వ్యవహరించడం క్షమించరానిదని కంపెనీ స్పష్టంచేసింది. చైర్మన్‌గా ఆయనకు పూర్తి స్వచ్ఛనిచ్చామని చెప్పింది. అనూహ్య రీతిలో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగింపునకు గురైన సైరస్‌ మిస్త్రీ బుధవారం ఆ సంస్థ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన టాటా సన్స్‌ యాజమాన్యం మిస్త్రీ ఆరోపణలపై వివరణ ఇచ్చింది. ఛైర్మన్‌ మార్పు అంశం బోర్డు సభ్యుల సమష్టి నిర్ణయమని.. సైరస్‌ మిస్త్రీ బోర్డు సభ్యుల విశ్వాసం కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది. అవకాశాలు, సవాళ్ల నిర్వహణ కోసం ఛైర్మన్‌కు బోర్డు నిర్ణయాధికారం ఇస్తుందని టాటా సన్స్‌ పేర్కొంది. మిస్త్రీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆయనను తొలగించామన్న అక్కసుతోనే వాస్తవాలను వక్రీకరించడం, నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆ ప్రకటనలో వ్యాఖ్యానించింది. సైరస్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని నిరూపించడానికి తమ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయని, వాటిని అవసరమైన సమయంలో ఆయా ఫోరమ్స్‌ ముందు ఉంచుతామని చెప్పింది. కంపెనీ చైర్మన్‌గా ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చామని, కంపెనీ డైరెక్టర్లు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆ ప్రకటనలో స్పష్టంచేసింది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను తొలగించారన్న ఆరోపణలను కూడా టాటాసన్స్‌ తిప్పికొట్టింది. చాలా ఏళ్లుగా కొన్ని అంశాల్లో బోర్డు సభ్యులు, టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీల విశ్వాసాన్ని మిస్త్రీ కోల్పోతూ వస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. టాటా గ్రూప్‌ సంస్కృతి, పనితీరు మిస్త్రీకి తెలియంది కాదని, ఆయన 2006 నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నారని ఆ ప్రకటనలో చెప్పింది. తాము రికార్డులను బయటపెట్టినప్పుడు నిజానిజాలన్నీ బయటపడతాయని సంస్థ అభిప్రాయపడింది. నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే టాటా గ్రూపు అసలైన బలమని స్పష్టంచేసింది.  విూడియా సమావేశంలో టాటా యాజమాన్యంపై సైరస్‌ మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ నన్నో అసమర్ధునిగా జమకట్టారు. అసలు ఛైర్మన్‌ పదవి వద్దని చెప్పినా పిలిచి కట్టబెట్టారు. చివరకు వివరణ కూడా తీసుకోకుండా పొమ్మన్నారు. ఛైర్మన్‌గా నా అధికారాలు కుదించారు. అన్నింట్లోనూ రతన్‌ టాటా తలదూర్చేవారు. నా నేను తీసుకున్న నిర్ణయాలన్నీ గ్రూపు ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే’ అంటూ మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేశారు.