మీటర్ కోసం వెళ్తే తల్లిని లోబర్చుకున్నాడు: కూతురిపై అత్యాచారం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతిలో విద్యుత్‌శాఖ ఉద్యోగి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. కరెంట్‌మీటర్‌ కోసం విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లిన ఓ వితంతువును సబ్‌ ఇంజినీర్‌ మాయమాటలుచెప్పి లోబర్చుకున్నాడు. అంతటితో ఆగని కామాంధుడు ఆ వితంతువు కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఈ విషయంపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.