మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

మిర్యాలగూడ, జనం సాక్షి : మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రం గూడెంలో గల మీనా మహిళ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయపూడి భవాని, లావణ్య పద్మ, తదితరులు పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ పండుగ ప్రతి ఇంట భోగభాగ్యాలను కలిగిస్తుందన్నారు. కుల మతాలకతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విద్యార్థుల చేత స్వయంగా తయారుచేసిన బతుకమ్మలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలకు కళాశాల చైర్మన్ ఎండి మహమ్మద్ అలీ డైరెక్టర్ షహలాబూ తూల్ బహుమతుల ప్రధానం చేశారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే షాజీ, కోఆర్డినేటర్ పూజ, వాణి ,భారతి, సునీత, భవాని తదితరులు పాల్గొన్నారు.