ముంచెత్తిన వరద
తోండంగి : నాలుగురోజలుగా కుండపోత వర్షాంతో తూర్పుగొదావరి జిల్లాలో వాగులు వంకలు పోటెత్తాయి. పంపా రిజర్వాయర్ పూర్తి స్థాయి.మట్టానికి రావడంతో వరద గేట్లను పూర్తిగా ఎత్తేశారు. దిగువనున్న అయకట్టు ఈ వరదనీటిలో చిక్కుకోవడంతో గోపాలపట్నం , ఎ కోత్తపల్లి తోండంగి సి. అగ్రహరం , జిల్లేడుపాడు, ముసలయ్యపేట గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సి.అగ్రహరం గ్రామంలో సైతం నీరు చేరటంతో అధికారులు అప్రమాత్తమయ్యారు. కాలనీవాసులకు అధికారులు భోజన సౌకర్యాలు కల్పించారు. వరద ఉద్ధృతి పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అదికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్రమంత్రి పల్లంరాజు, స్థానిక ఎమ్మెల్యే అశోక్‌బాబు. జిల్లాకలెక్టరు నీతూ ప్రసాద్ ఈ మద్యాహ్నం గ్రామంలో పర్యటించనున్నారు.