ముందస్తు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము

— అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
— కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటా వార్పు ద్వారా ఉద్యమ కార్యాచరణ చేపడతాం.
— సీపిఎం మండల కార్యదర్శి ఎస్‌. మల్లేష్‌.

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 24( జనం సాక్షి న్యూస్ )పోలీసులు అత్యుత్సాహముతో చేపట్టిన ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నామని సీపిఎం మండల కార్యదర్శి ఎస్‌. మల్లేష్‌ అన్నారు. పేద ప్రజలకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేటాయింపుకై గత మూడు రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సత్పలితానివ్వక పోవడంతో డబుల్‌ బెడ్రూం ఇండ్ల ముట్టడికై సీపింఎం పార్టీ ఇచ్చిన పిలుపు సందర్భంగా బుధవారం నాడు అచ్చంపేట పట్టణములోని మహేంద్రనగర్‌ కాలనీలో సీపిఎం పార్టీ జిల్లా నాయకులు వర్దం పర్వతాలు, ఆర్‌. శ్రీను మరియు కాలనీ మహిళలను పోలీసుల ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లకై గత 3 రోజుల నుండి శాంతియుతంగా నిర్వహించుచున్న రిలే నిరహార దీక్షలకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున డబుల్‌ బెడ్రూం ఇండ్లను ముట్టడిస్తామని ముందస్తుగానే చెప్పినప్పటికి గత రాత్రి నుండి పోలీసులు అత్యుత్సాహముతో మమ్మల్ని ఎక్కడికక్కడే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా సీపిఎం ఖండిస్తున్నామని ఆరోపించారు. 2013లో నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలకై సీపిఎం పార్టీ చేసిన పోరాటల ఫలితంగా సర్వే నెంబర్‌ 211లో 1142 మందికి గత ప్రభుత్వం నిరుపేద ప్రచలకు ఇచ్చిన అట్టి ఇండ్ల స్థలాల లే`అవుట్‌లను ప్రస్తుత తెరాస ప్రభుత్వం చెడగొట్టి డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నా నేటి వరకు అట్ట ఇండ్లను నిరుపేదలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఇండ్ల స్థలాల పట్టాలు పొందిన వారికి ఇండ్లు కేటాయించాలని 2018 నుండి తహశీల్దార్‌, ఆర్డీఓలకు ఎన్నో పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నా స్పందన లేనందునే నేడు గత 3 రోజుల నుండి రిలే నిరహార దీక్షలు చేపట్టామని స్పందించకపోతే 24న అట్టి డబుల్‌ బెడ్రూం ఇండ్లను పేదలు ఆక్రమించుకుంటారని ముందే తెలిపామని గుర్తు చేశారు. అక్రమ అరెస్టులను తాలూకా లోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘ పార్టీలు, మేదావి వర్గమంతా ఇటువంటి అక్రమ అరెస్టులను ఖండిరచాలని విజ్ఞప్తి చేశారు. ఇండ్ల కేటాయింపుపై ఎమ్మేల్యే గువ్వల బాలరాజు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, పేదలకు అట్టి ఇండ్లను కేటాయించేంతవరకు కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటా వార్పులతో నిరసనల చేపట్టే కార్యాచరణ చేస్తామని, నిరుపేదలకు ఇండ్లు సాదిస్తామని ప్రతిన చేసారు. అరెస్టు అయిన వారిలో సీపిఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, సీపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్‌. దేశ్యా నాయక్‌, ఆర్‌. శ్రీనివాసులు, నాయకులు శంకర్‌ నాయక్‌ మరియు పెద్ద ఎత్తున మహిళలు వున్నారు