ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం
హెచ్చరికలు ఉన్నా సన్నద్దంగా లేరు
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్
హైదరాబాద్,జూలై14(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాలు ఆగమయ్యాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నాప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రబుత్వ నిర్లక్ష్యం కారణంగగా విపరీతంగా నస్టం వాటిల్లిందన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… వాతావరణ శాఖ అలర్ట్ చేసినప్పటికీ రాష్ట్ర సర్కార్ సిద్ధం కాలేదని అన్నారు. వానలకు రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని… చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ వదలడం లేదని… రాజకీయాలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ వంతు బాధ్యతగా సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. హైదరాబాద్‌ను వదిలి సీఎం కేసీఆర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని మహేష్ కుమార్ గౌడ్ హితవుపలికారు.