ముంపునకు గురైన పొలాలకు వెంటనే దారి ఏర్పాటు చేయండి

రుద్రంగి ఆగస్టు 7 (జనం సాక్షి);
రుద్రంగి గ్రామంలో ఎల్లంపల్లి కాల్వ నిర్మాణం చేయడం ద్వారా ముంపునకు గురైనటువంటి పొలాలను పరిశీలించి అటువైపు వెళ్ళడానికి దాదాపు 300 ఎకరాల పొలాలకు వెళ్లడానికి దారి లేకుండా ఎల్లంపల్లి కార్వా నిర్మాణం చేయడం దారి లేకపోవడం ద్వారా రైతులు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు  రైతులకు వెంటనే తాత్కాలిక దారి ఏర్పాటు చేయాలని,అధికారుల కు తెలపడం జరిగింది.రెండు రోజులలో దారి  ఏర్పాటు చేయకపోతే ఆకాలువను పూడ్చివేసి  దారి ఏర్పాటు చేసుకుంటామని రైతులు పేర్కొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్ డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మాట్లాడుతూ… 2018 లో అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా తాత్కాలికంగా అధికారులు అధికార పార్టీ నాయకులు కలిసి అప్పటి ఎలక్షన్ల కోసమే రైతుల ఇబ్బందులు చూడకుండా కేవలం ఓట్ల  కోసమే కాలువనిర్మానం చేసి రైతుల పొలాలు మునిగిపోయిన రైతులకు దారులు లేకుండా చేసిన ఘనత అధికార పార్టీకి చెల్లుతుంది అని ఇప్పటికైనా  ఇలాంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని  ప్రజల పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగు లచ్చిరెడ్డి,అభిలాష్ మరియు స్థానిక రైతులు  రవి,మల్లేశం,చేపూరి గంగాధర్,మల్యాల రాజయ్య,పెద్ద నరసయ్య 50 మంది రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.