ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా
ఖమ్మం,మార్చి02(జనంసాక్షి): నెల్లిపాక మండలం ఎటపాక ఎంఈవో కార్యాలయం వద్ద పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయులు సోమవారం ధర్నాకు దిగారు. ముంపు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాను ఉద్దేశించి పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడారు. ముంపు మండలంలోని ఉపాధ్యాయులు తెలంగాణ జీతాలే కావాలని కోరుతున్నా, ఆంధ్ర అధికారులు తాము చెల్లిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధజ్రీతాలు తీసుకోమని చెప్పిన తమను తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. స్పష్టమైన హావిూ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని వారు తెలిపారు. సుమారు గంట నుంచి కొనసాగుతున్న ధర్నాతో చర్ల, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.