ముంబైలో జిల్లా యువతి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి,జూలై23(జనంసాక్షి): జిల్లాకు చెందిన మహిళ ముంబయిలో ఆత్మహత్య చేసుకుంది. అంధేరిలోని జుగల్లి వద్ద కొండా శంకర్, సంధ్య అనే దంపతులు నివాసముంటున్నారు. అయితే, సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు మోత్కూరు మండలం దత్తప్పగూడెం వాసి అని తెలిసింది. కాగా, సంధ్య బంధువులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య ఆత్మహత్య చేసుకోలేదని, భర్తనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.