ముఖ్యమంత్రికి దత్తన్న మరో లేఖ
హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. కరెంట్ కోతల్లో రాష్ట్ర సర్కార్ రికార్డు సృష్టించిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు దత్తాత్రేయ బుధవారం 65వ బహిరంగ లేఖ రాశారు.
విపక్షాలు ఉద్యమించినా… అసెంబ్లీలో ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన వ్యాఖ్యానించారు రైతులకు నాలుగు గంటలైనా విద్యుత్ అందటం లేదని దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కోతలతో యాభై శాతం పంటలు ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



