ముఖ్యమంత్రితో సమావేశమైన సీపీఎం నేతలు
హైదరాబాద్:ఎత్తిపోతల పధకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను 16 గంటలపాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.ఒక్క కృష్ణ జిల్లాలో ఉన్న 115 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా 92వేల ఎకరాల్లో పంటసాగవ్వాల్సి ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ నిర్వహణలోనే ఈ ఎత్తిపొతల పథకాలు ఉంటే పూర్తిస్థాయిలో సాగు సక్రమంగా ఉంటుందని..రైతులే నిర్వహిస్తుండటం ఏటా భారం ఎక్కువైపొతుండటంతోపాటు సాగు తగ్గుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్య పనిష్కారానికి త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించినట్లు నేతలు తెలిపారు.