ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలి:గండ్ర
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం కిరణ్ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం జరగదని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఎంతగానో బాధించాలయని గండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ నేతలం మంత్రి జానారెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్తామని తెలియజేశారు. ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌కు అనుమతినిచ్చి మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ వాదులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కుటుంబ సభ్యుల నుంచి తన నాయకత్వానికి ప్రమాదం ఉందనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తున్నాడు. తప్పా ప్రజల కోసం కాదని చెప్పారు.