ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్ష):-నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్
పేరును పెట్టాలని  ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు  నిర్ణయించిన నేపథ్యంలో యాచారం మండల కేంద్రంలో మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పాశ్చ బాషా అధ్యర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్‌  చిత్రపటానికి క్షీరాభిషేకం  చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని సమపాలతో ఒకే దృష్టి తో పరిపాలన సాగిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటె ఒక తెలంగాణ మాత్రమే నని ముఖ్యమంత్రి  కెసిఆర్ కే దక్కుతుందన్నారు. అదేవిధంగా దేశంలో అభివృద్ధి ని పక్కన పెట్టిన కొంతమంది కాషాయ నాయకులు మత విద్వేశాలను  రెచ్చగొట్టి కులాల మధ్య కొట్లాటలు పెట్టి.. దళితులు పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తున్నట్లు నటించే కాషానాయకులు దమ్ముంటే పార్లమెంట్ కు  బాబాసాహెబ్ అంబేడ్కర్  పేరు పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి విభాగం మండల అధ్యక్షుడు మండలి గోపాల్ , వివిధ గ్రామాల
ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area